దయ్యము పట్టినవాడు | Telugu Christian Illustrations
దయ్యము పట్టినవాడు అయితే ఆయన - నీవు నీ యింటికి తిరిగి వెళ్లి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను ; వాడు వెళ్లి దేవుడు వానికెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమంతటను ప్రకటించెను (లూకా 8:39) , గెరాసేనుల దేశములో దయ్యము పట్టినవాడు యేసు ప్రభువును ఎదుర్కొన్నాడు. అతడు దుస్తులు ధరించకుండా నగ్నంగా తిరుగుతూ సమాధులలో నివసించేవాడు. యేసు ప్రభువు అతనిని స్వస్థపరచిన తరువాత "నేను కూడ మీతో వస్తాను ప్రభువా!" అని బ్రతిమాలాడు. కానీ యేసు ప్రభువు "నీవు ఇక్కడే ఉండి దేవుడు నీ యెడల చేసిన కార్యముల గురించి ఇతరులకు వివరించి చెప్పు" అని ఆజ్ఞాపించారు. అతడు లేచి తన ఇంటివైపు నడక సాగించాడు. కిటికీ నుండి అతని పిల్లలు అతని చూసారు. "అమ్మా! నాన్న వస్తున్నాడు" అని అరిచారు. ఆమె కంగారుగా “తలుపు మూయండి. కిటికీలు అన్నీ మూసివేయండి" అని అరిచింది. పిల్లలందరూ తలుపులు మూసివేసారు. పోయినసారి అతడు ఇంటికి వచ్చినప్పుడు కుర్చీలు విరుగగొట్టాడు. పెంచుకొంటున్న పూల మొక్కలన్నిటినీ పెరికి పారవేసాడు. పిల్లలు భయంగా చూస్తూ ఉండగా తల్లిని జుట్టు పట్టుకొని...