Posts

దయ్యము పట్టినవాడు | Telugu Christian Illustrations

దయ్యము పట్టినవాడు   అయితే ఆయన - నీవు నీ యింటికి తిరిగి వెళ్లి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను ; వాడు వెళ్లి దేవుడు వానికెట్టి  గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమంతటను ప్రకటించెను (లూకా 8:39) , గెరాసేనుల దేశములో దయ్యము పట్టినవాడు యేసు ప్రభువును ఎదుర్కొన్నాడు. అతడు దుస్తులు ధరించకుండా నగ్నంగా తిరుగుతూ సమాధులలో నివసించేవాడు. యేసు ప్రభువు అతనిని స్వస్థపరచిన తరువాత "నేను కూడ మీతో వస్తాను ప్రభువా!" అని బ్రతిమాలాడు. కానీ యేసు ప్రభువు "నీవు ఇక్కడే ఉండి దేవుడు నీ యెడల చేసిన కార్యముల గురించి ఇతరులకు వివరించి చెప్పు" అని ఆజ్ఞాపించారు. అతడు లేచి తన ఇంటివైపు నడక సాగించాడు. కిటికీ నుండి అతని పిల్లలు అతని చూసారు. "అమ్మా! నాన్న వస్తున్నాడు" అని అరిచారు. ఆమె కంగారుగా “తలుపు మూయండి. కిటికీలు అన్నీ మూసివేయండి" అని అరిచింది. పిల్లలందరూ తలుపులు మూసివేసారు. పోయినసారి అతడు ఇంటికి వచ్చినప్పుడు కుర్చీలు విరుగగొట్టాడు. పెంచుకొంటున్న పూల మొక్కలన్నిటినీ పెరికి పారవేసాడు. పిల్లలు భయంగా చూస్తూ ఉండగా తల్లిని జుట్టు పట్టుకొని...

ఆయనే చెప్పారు! | Telugu Christian Illustrations

  ఆయనే చెప్పారు! దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు అయనను అనుగ్రహించెను (యోహాను 3:16). నెపోలియన్ తన గుర్రమును అధిరోహించి సైన్యమును పరిశీలిస్తున్నాడు. అకస్మాత్తుగా అయన గుర్రము బెదిరి వెనుక కాళ్ళ మీదకు లేచింది. నెపోలియన్ చేతిలోని కళ్ళెము జారిపోయినది. గుర్రము పరుగు తీయుట ప్రారంభించింది. నెపోలియన్ పరిస్థితి చాల ప్రమాదంగా ఉన్నది. ఒక సైనికుడు అది చూచాడు. అతడు వేగంగా పరుగెత్తి గుర్రపు కళ్ళెము పట్టుకొని గుర్రము ఆపాడు. అది చాల ప్రమాదముతో కూడుకొన్న పని. గుర్రము అతనిని త్రొక్కవచ్చును. అయినా అతడు తెగించి గుర్రమును ఆపాడు. నెపోలియన్ సంతోషించి "ఈ రోజు నుండి నిన్ను శతాధిపతిని చేస్తున్నాను" అన్నాడు. అ సైనికుడు వెంటనే నెపోలియన్కు సెల్యూట్ చేసి శతాధిపతులు కూర్చుండే స్థలమునకు వెళ్లాడు. అతని దళపతి "శతాధిపతులు కూర్చుండే చోటికి నీవు ఎందుకు వెళుతున్నావు ? దళపతినైన నాకే అక్కడికి వెళ్లే అధికారము లేదు. నీవు వచ్చి ఇక్కడ లైనులో నిలబడు" అని అరిచాడు. ఆ సైనికుడు "నేను అక్కడిక...

జారవిడచుకొనుట | Telugu Christian Illustrations

జారవిడచుకొనుట ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఏలాగు తప్పించుకొందుము ? ( హెబ్రీ . 2:3). అమెరికాలోని పెన్సిల్వానియా రాష్ట్రమునకు పొల్లాక్ ( Pollock)  గవర్నర్గా ఉన్నప్పుడు   ఎడ్వర్డ్ అను ఒక వ్యక్తి హత్యా నేరముపై ఖైదు చేయబడ్డాడు. కోర్టులో అతని నేరము   నిరూపణ అయినందువలన అతనికి ఉరి శిక్ష విధించారు. పొల్లాక్ గారు మంచి క్రైస్తవుడు.   ఎడ్వర్డ్ను క్షమాభిక్ష ప్రసాదించమని అనేకులు పొల్లాక్ గారిని కోరారు. పొల్లాక్ గారు   చట్ట ప్రకారము కోర్టు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని ఈ కోర్టు ఇచ్చిన తీర్పు   విషయములో తాను జోక్యము చేసుకొనననీ సున్నితంగా తిరస్కరించారు. ఎడ్వర్డ్కు ఉరి శిక్ష పడినందువల్ల క్రైస్తవుడు అయిన పొల్లాక్ గారు అతనికి సువార్తను   ప్రకటించాలని ఆశించారు. అందువల్ల తానే స్వయంగా జైలుకు వెళ్లి ఎడ్వర్డ్ ప్రక్కనే   కూర్చుండి సువార్తను చెప్పారు. ఈ లోక న్యాయమూర్తులు మరణశిక్ష విధించిననూ   పరలోక న్యాయమూర్తిని శరణు జొచ్చినచో నిత్య రక్షణను అనుగ్రహించునని ఎంతో   ఓపికగా ,  సౌమ్యంగా అతనికి నచ్చజెప్పారు. ఎడ్వర్డ్ కన్నీరు విడుస్తూ తన పాప...

ఆత్మల పట్ల భారము | Telugu Christian Illustrations

ఆత్మల పట్ల భారము నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడియున్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపక "పోయిన యెడల నాకు శ్రమ (1కొరింథీ 9:16). ఫెడ్రిక్ గారు 1867లో మన దేశంలో సువార్త ప్రకటించుటకు ఇంగ్లాండ్ నుండి వచ్చారు. ఆరోగ్యము క్షీణించినందువల్ల విశ్రాంతి కొరకు తిరిగి ఇంగ్లాండ్ వెళ్లారు. ఎడిన్బరోలో జూన్ మాసంలో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుటకు ఆయనను ఆహ్వానించారు. ఎంతో అనారోగ్యముగా ఉన్ననూ ఆయన ఓపిక తెచ్చుకొని ఆ సభకు  హాజరయ్యారు. తన గురించి , తన సేవ గురించి క్లుప్తంగా మాట్లాడి భారత దేశంలో సువార్త అవశ్యకత గురించి అక్కడ ఉన్న పాస్టర్లకు వివరించి తమ సంఘముల నుండి మిషనెరీలను పంపవలసినదని విజ్ఞప్తి చేసారు. ఆయన ఇంకా మాట్లాడు చుండగానే నీరసము వలన స్పృహతప్పి పడిపోయారు. ఆయన స్నేహితులు ఆయనను ఆసుపత్రికి తీసుకొని వెళ్లి వైద్యము చేయించారు. అయన స్పృహలోనికి రాగానే "నేను ఎక్కడ ఉన్నాను ?" అని అడిగారు. ఆయన స్నేహితులు "నీవు మాట్లాడు చుండగా నీరసము వలన స్పృహతప్పి పడిపోయావు. అందువలన డాక్టర్ వద్దకు తీసుకొని వచ్చాము" అ...

పనిలో శ్రద్ధ | Telugu Christian Illustrations

పనిలో శ్రద్ధ చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనియైనను నీ శక్తి లోపము లేకుండ చేయుము ( గలతీ 9:10). మనము మేలు చేయుటయందు విసుగక యుందము. మనము అలయక మేలు చేసితిమేయని తగిన కాలమందు పంట కోతుము (గలతీ 6:9). సుమతికి 55 సంవత్సరములు. తన ఇంటికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న చర్చికి నడిచి వెళ్లి అక్కడ ఉన్న పిల్లలకు సండే స్కూల్ నడిపించేది. ఒక రోజు ఆదివారము ఉదయమే వర్షము కురియుట ప్రారంభమైనది. ఈ వర్షంలో సండేస్కూల్కు ఎవరు వస్తారు ? అని వెళ్లడం మానివేసింది. పది నిమిషములు గడిచిన తరువాత ఒక వేళ ఎవరైనా వస్తే నేను అక్కడ లేనని నిరాశపడతారేమో అని లేని ఓపికను తెచ్చుకొని గొడుగు తీసుకొని మెల్లగా ఆ వర్షంలో రెండు మైళ్ళు నడుచుకొంటూ చర్చికి చేరింది. ఆ రోజు పాల్సన్ అనే ఒకే ఒక అబ్బాయి సండే స్కూల్కు వచ్చాడు. అతనికి బైబిల్ కథ చెప్పినది. ఆ   అబ్బాయి మరలా ఎప్పుడు సండే స్కూల్కు రాలేదు. సుమతి తన శ్రమంతా వృధా అయినదని అనుకొంటూ ఉండేది. కొన్ని సంవత్సరముల తరువాత సుమతికి ఒక ఉత్తరము వచ్చింది. మిలటరీలో ఉన్న ఒక సైనికుడు ఆమెకు ఆ ఉత్తరము వ్రాసాడు. తాను వర్షము వచ్చిన రోజున సండే స్కూల్కు వచ్చిన పాల్సన్ను అని పరిచయము చేసుకొన్నాడు. ...

యాచకుడు | Telugu Christian Illustrations

  యాచకుడు ఆయన వారితో "మీరు ఏవిధమైన లోభమునకు చోటియ్యక జాగ్రత్తపడుడి . ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు" అనెను (లూకా 12:15). పాస్టర్ ఇమ్మానుయేలు గారి దగ్గరకు పారిశ్రామికవేత్త అయిన ప్రసాదు వచ్చాడు. “ పాస్టరు గారూ! నా వ్యాపారాలు బాగుగా అభివృద్ధి చెందాలని ప్రార్ధన చేయండి” అంటూ 10 వేల రూపాయలు పాస్టరు గారికి అందించాడు. పాస్టరు గారు ఆ డబ్బు తీసుకొని "మీ వద్ద ఇంకా ధనం ఉన్నదా ?” అని అడిగారు. “ ఉన్నదండీ” అన్నాడు ప్రసాదు. " మీకు ఇంకా ధనం కావాలని ఆశ ఉన్నదా ?” “ అవునండీ” అన్నాడు ప్రసాదు. అప్పుడు ఇమ్మానుయేలు గారు “అయితే ఈ 10 వేలు మీ దగ్గరే ఉంచండి. మీరు నాకంటే ఎక్కువ అవసరం కలిగి యున్నారు. నా వద్ద డబ్బు ఏమీ లేదు. అయినా కావాలనే కోరికా లేదు. నీ వద్ద చాలా డబ్బు ఉంది. అయినా ఇంకా చాలా కావాలని ఆశ ఉంది. అందువల్ల ఇది నీ వద్ద ఉంటేనే మంచిది" అంటూ ప్రసాదు ఇచ్చిన 10 వేలు తిరిగి ఇచ్చేసారు. డా॥ పి.బి.మనోహర్

ప్రార్ధన పలుకులు | Telugu Christian Illustrations

ప్రార్థన పలుకులు 1.        పరలోకపు శక్తిని దింపగలిగిన భూలోకపు శక్తి ప్రార్ధన మాత్రమే – ఆండ్రూ ముర్రే 2.        వ్యక్తిగతంగా ఎక్కువ సేపు ప్రార్ధించుకొనే వారు బహిరంగంగా క్లుప్త ప్రార్థనలు చేస్తారు – ఇ.యం. బౌండ్స్ 3.        బాగా ప్రార్ధించగలిగినవాడే , బాగా చదువుకున్నవాడు – మార్టిన్ లూథర్ 4.        ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది. ఆ విధంగానే పాపం , ప్రార్ధన చేయకుండా ఆపుతుంది – జాన్ బన్యన్ 5.        ప్రార్థనలో మనం ఏం చెబుతామన్నది ముఖ్యం కాదు , దేవుడు మనతో ఏం చెబుతాడన్నది ముఖ్యం – మదర్ థెరిస్సా 6.        ప్రార్థన ఊపిరి వంటిది. ఊపిరాడక పోతే మనిషి చనిపోతాడు. ప్రార్ధన చేయకపోతే క్రైస్తవుడు ఆత్మలో చనిపోతాడు – సాధు సుందర్ సింగ్ 7.        ఉదయం ఒక అరగంట దేవునితో సంభాషిస్తే , రాత్రి ఒక గంట ఒప్పుకోవటం తప్పుతుంది – ఒక ప్రార్థనా వీరుడు 8.        ప్రార్థనలో గడ...

Popular posts from this blog

యాచకుడు | Telugu Christian Illustrations

జారవిడచుకొనుట | Telugu Christian Illustrations

ఆత్మల పట్ల భారము | Telugu Christian Illustrations